News

జగన్ కు 2 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి

జేసీ దివాకర్ రెడ్డి వ్యవహార శైలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనకి లోపల ఏమి అనిపిస్తే దానిని బయటకు చెప్పటం ఆయన నైజం. ఏకంగా ఒక్కోసారి చంద్రబాబు నాయుడు ముందే తాను చెప్పాలి అనుకుంది బలంగా చెప్పగలిగే సత్తా కలిగిన జేసీ. ఆయన ఏమి మాట్లాడిన అది ఒక సంచలనంగా మారిపోతుంది. తాజాగా శింగనమల నియోజకవర్గంలో టీడీపీ పార్టీ సమావేశం జరిగింది. ఇందులో జగన్ ని ఉద్దేశించి జేసీ కీలకమైన వ్యాఖ్యలు చేశాడు.

ఒక మూర్ఖుడిలాగ జగన్ రాష్ట్రంలో పాలన చేస్తున్నాడని, చంద్రబాబు ఎంతో కష్టపడి పోలవరం నిర్మిస్తుంటే, ఇప్పుడు వచ్చిన జగన్ దాని టెండర్లను కాన్సుల్ చేపించి, రీ టెండర్లు వేస్తామని చెప్పటం బాధాకరం.ప్రజలు తప్పనిసరిగా బుద్ధి చెప్పడం ఖాయమని, మరో రెండున్నర సంవత్సరాలలో ఎన్నికలు రావడం ఖాయమని జోస్యం చెప్పారు. మరో ఆరు మాసాల్లో జగన్‌ పార్టీకి వ్యతిరేకత వస్తుందని, అప్పటి వరకు టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఓపిగ్గా ఉండాలి. టీడీపీ కార్యకర్తలకి ఏమైనా ఇబ్బంది కలిగే పరిస్థితులు వస్తే వాళ్ళకి అండగా మేము నిలబడి పోరాటం చేస్తామని చెప్పుకొచ్చాడు.